మొబైల్‌ బిల్లు పెరిగిపోతోందని బాధపడేవారికి ఓ శుభవార్త. మీ ఫోన్‌ బిల్లును మీకు పైసా వ్యయం లేకుండా మరెవరో చెల్లించే వీలు కల్పిస్తే ఎలా ఉంటుంది? ఎంత బాగుంటుందోనని అనుకుంటున్నారా. సరిగ్గా ఇలాంటి సదుపాయాన్నే అందిస్తోంది (ఝజ్ఛీట.ఛిౌఝ) ఎంజింజర్‌.కామ్‌. ఈ సైట్‌లో పేరు, వివరాలు నమోదు చేసుకోవడం ద్వారా నెలకు కనీసం రూ. 300 దాకా ఆర్జించవచ్చు. ఇందుకు పెద్దగా కష్టపడేదేమీ కూడా ఏమీ లేదు. మీకు అభిరుచి ఉన్న అంశాలపై, మీరు కోరుకున్న సమయాల్లో ఎస్‌ఎంఎస్‌లు పంపించేందుకు అనుమతిస్తే చాలు. ఇక ఆపై మీరు పొందే ప్రతీ ఎస్‌ఎంఎస్‌ ద్వారా 20 పైసలు మీ ఖాతాలో జమ అవుతాయి. నెల తిరగ్గానే ఈ మొత్తం చెక్కు ద్వారా లేదా చిన్న మొత్తాలైతే ఎంకూపన్ల ద్వారా మీకు అందుతుంది. ఈ ఎంకూపన్ల ప్రముఖ రిటెయిల్‌ స్టోర్‌లలో చెల్లింపులకు వాడుకోవచ్చు.


.
అభిరుచులకు అనుగుణంగా...


ఎంజింజర్‌ సహవ్యవస్థాపకుడు, సీఈఓ చైతన్య నల్లన్‌ ఈ సందర్భంగా మాట్లాడుతూ, స్పామ్‌ మెసేజ్‌ల బారి నుంచి తప్పించుకునేందుకు తాము ప్రవేశపెట్టిన విధానం ఎంతో ఉపకరిస్తుందని అన్నారు. ఇది అటు వినియోగదారులకు, ఇటు ప్రకటనదారులకు కూడా లాభం చేకూర్చేదిగా ఉంటుందని అన్నారు. తాము పంపించే ఎస్‌ఎంఎస్‌ల ద్వారా విశ్వసనీయ ఉత్పాదనలు, సేవలు, ఇతర అభిరుచులకు సంబంధించిన సమాచారం పొందవచ్చని అన్నారు. రోజూ అసంఖ్యాకంగా మెసేజ్‌లు ఉండవని, తమకు ఏ అంశానికి సంబంధించి ఎన్ని మెసేజ్‌లు, ఏ సమయంలో రావాలో సభ్యులు నిర్ణయించుకోవచ్చునని, వాటికి అనుగుణంగానే ఎస్‌ఎంఎస్‌లు పంపిస్తామని చైతన్య చెప్పారు. ఆల్కహాల్‌, చట్టవిరుద్ధ వ్యాపార కార్యకలాపాలకు సంబం ధించిన ప్రకటనలు స్వీకరించబోమని స్పష్టం చేశారు.


.
ప్రకటనదారులకూ లాభం...


ప్రకటనదారులు కూడా తమ నిర్దిష్ట టార్గెట్‌ గ్రూప్‌ను చేరుకోవడానికి ఈ ఎస్‌ఎంఎస్‌లు ఉపకరిస్తాయని చైతన్య అన్నారు. సభ్యులుగా చేర్చుకొనే ముందు ప్రాంతం, వయస్సు, అభిరుచులు, ఆదాయం తదితర వివరాలు తాము తెలుసుకుంటామని, ఈ డేటాబేస్‌లోనుంచి, ప్రకటనదారుల అభీష్టాన్ని బట్టి ఎంపిక చేసుకున్న టార్గెట్‌ గ్రూప్‌కు ఎస్‌ఎంఎస్‌లు పంపిస్తామన్నారు. అతి తక్కువ ఖర్చుతో తాము కోరుకున్న టార్గెట్‌ గ్రూప్‌ను చేరుకునేందుకు వీలవుతుందని అన్నారు. రూ.5 వేల ప్యాకేజీతో తమ ప్రకటన ఆఫర్లు మొదలవుతాయని చెప్పారు.


.
ఈవెంట్‌‌స, డిస్కౌంట్‌ ఆఫర్ల సమాచారం...


తమకు వచ్చే యాడ్‌‌సలో అధిక శాతం రకరకాల డిస్కౌంట్‌లకు సంబంధించినవేనని, ఇవి కొనుగోలుదారులకు ఎంతో ఉపయుక్తంగా కూడా ఉంటాయని చైతన్య అన్నారు. ఈవెంట్‌‌స సమాచారాన్ని నిమిషాల్లో లక్షల మందికి అందించవచ్చునని పేర్కొన్నారు.


.
చెల్లింపులు ఇలా...


ఈ వెబ్‌సైట్‌లో సభ్యులుగా చేరి ఎస్‌ఎంఎస్‌లు స్వీకరించే వారికి, అందుకునే ప్రతీ ఎస్‌ఎంఎస్‌కు 20 పైసల చొప్పున ఆదాయం వస్తుంది. ఇందులో మరో విశేషం నెట్‌వర్‌‌క విధానం కూడా ఉండడం. రెండు దశల వరకు ఈ నెట్‌వర్‌‌క లాభాలు ఉంటాయి. రెఫరెన్‌‌స ద్వారా ఇతరులను చేర్పించడం వల్ల అదనపు ఆదాయం పొందవచ్చు. ఖాతాలో జమ అయిన మొత్తం రూ. 300 అంతకు మించితే చెక్కులు పంపిస్తామని, అంతకంటే తక్కువ ఉన్న పక్షంలో గిఫ్‌‌టకూపన్ల తరహాలో ఎంకూపన్లు పంపిస్తామని, ప్రసిద్ధ రిటెయిల్‌ స్టోర్‌లలో వాటిని వస్తువుల చెల్లింపునకు వినియోగించవచ్చునని తెలిపారు. వాహ్‌ మాగ్నా, కాపర్‌ చిమ్నీ, నూడిల్‌ బార్‌, సై్పసీ వెన్యూ, సిక్‌‌స ప్యాక్‌, లిటిల్‌ ఇటలీ, సై్పస్‌ కింగ్‌, పిక్‌ ఎన్‌ మూవ్‌, యోకో సిజ్లర్‌‌స, కోలని కిచెన్‌, కంట్రీ ఓవెన్‌ తదితర స్టోర్‌లలో ఈ ఎంకూపన్‌లను వాడు కోవచ్చని అన్నారు. తమ వద్ద ఇప్పటికే 20 లక్షలమంది తమ వివరాలను నమోదు చేయించుకున్నారని, రోజుకు కొత్తగా 5 వేల మంది దాకా చేరుతుంటారని చైతన్య తెలిపారు. ప్రస్తుతం తమ సేవలను భారతదేశానికే పరిమితం చేశామని తెలిపారు. బెంగుళూరు ప్రధాన కేంద్రంగా పని చేస్తున్నప్పటికీ, హైదరాబాద్‌తో సహా వివిధ నగరాల్లో బ్రాంచీలు ఉన్నాయన్నారు. బిగ్‌బజార్‌, స్పెన్సర్‌‌స, మెగామార్‌‌ట, మ్యాక్‌‌స న్యూయార్‌‌క లైఫ్‌, సిటీ ఫైనాన్షియల్‌ లాంటి ప్రఖ్యాత సంస్థలు తమ క్లయింట్లుగా ఉన్నాయన్నారు.


.


బెంగుళూరులో రిబక్‌‌స అనే కంపెనీ రూ. 5 వేలు తమకు చెల్లించి, బెంగుళూర్‌ పిన్‌కోడ్‌ పరిధిలో ఉన్న తమ సైట్‌ సభ్యులందరికీ ఎస్‌ఎంఎస్‌లు పంపిం చడం ద్వారా అమ్మకాలను వృద్ధి చేసుకొని రూ. మూడు లక్షల దాకా ఆదాయం పొందిందని పేర్కొన్నారు. సుమారు ఏడాదిన్నర క్రితం ప్రారంభించిన తమ సంస్థకు అన్ని చోట్లా మంచి స్పందన వస్తోందని అన్నారు. కళానికేతన్‌, మౌంట్‌ ఒపేరా, భారత్‌స్టూడెంట్‌.కామ్‌, హైదరాబాద్‌ హౌజ్‌, బౌల్‌-ఒ- చైనా, స్పెన్సర్‌‌స, సృష్టి బాత్‌‌స, సంగీతా మొబైల్‌‌స, హైదరాబాద్‌ సెంట్రల్‌, పాంటలూన్‌‌స, ఐఎం ఎస్‌, ప్రజయ్‌ రియల్‌ ఎస్టేట్‌, ఎలియన్‌‌స స్పేస్‌ స్టేషన్‌ లాంటి ప్రముఖ సంస్థలకు తాము ప్రచార సేవలను అందిస్తున్నట్లుగా చైతన్య తెలిపారు.
Sign Up... Sign Up... Sign Up...


0 comments:

Related Posts Plugin for WordPress, Blogger...